ఐసీఐసీఐ,పీఎన్‌బీ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌!

2 Jun, 2023 16:26 IST|Sakshi

సాక్షి,ముంబై: బ్యాంకింగ్‌ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్‌ఆర్‌) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును  8.75 శాతంనుంచి  8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్‌ ఆఫర్‌: ఐపోన్‌ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్‌)

మరోవైపు  పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది.  ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు  8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు  8.80శాతంనుంచి  8.90 శాతానికి పెంచింది.

ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? 

మరిన్ని ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌, బిజినెస్‌ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

మరిన్ని వార్తలు