ఆ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!

23 Sep, 2022 07:43 IST|Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ పండుగ సీజన్‌ పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ’ఫెస్టివ్‌ బొనాంజా’ పేరిట ప్రత్యేక ఆఫర్లనక్ప్రకటించింది. తమ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, కన్జూమర్‌ ఫైనాన్స్, కార్డ్‌లెస్‌ ఈఎంఐ మొదలైన వాటి ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చని పేర్కొంది.

ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్‌బాస్కెట్, అజియో, రిలయన్స్‌ డిజిటల్, క్రోమా తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంకు ఈడీ రాకేష్‌ ఝా తెలిపారు. రుణాలపై కూడా (గృహ, వ్యక్తిగత, బంగారం రుణాలు మొదలైనవి) ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని వివరించారు. వీటితో పాటు బ్యాంక్‌ పేర్కొన్న వస్తువులను కొనుగోళ్లు చేసే కస్టమర్లకు కార్డ్‌లెస్ ఈఎంఐ(EMI), 'నో-కాస్ట్ ఈఎంఐ(EMI) వంటి సౌకర్యాలను అందిస్తోంది.

ప్రముఖ బ్రాండ్‌లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంపై ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్రా, టాటా క్లిక్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో ఆన్‌లైన్ షాపింగ్‌పై 10% తగ్గింపు.
గ్లోబల్ లగ్జరీ బ్రాండ్‌లు: అర్మానీ ఎక్స్ఛేంజ్, కెనాలి, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్, బ్రూక్స్ & బ్రదర్స్ వంటి లగ్జరీ బ్రాండ్‌లపై అదనపు 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్‌లపై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లలో 10% వరకు క్యాష్‌బ్యాక్. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌లో కస్టమర్లు ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు.
దుస్తులు & ఆభరణాలు: షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, అజియో, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ దుస్తుల బ్రాండ్‌లపై అదనంగా 10% తగ్గింపు. అలాగే పీసీ జ్యువెలర్స్ (PCJ) నుంచి కనీసం ₹50,000 కొనుగోలుపై ₹2,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

చదవండి: Volkswagen: ఇండియన్‌ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్  భారీ షాక్‌ 

మరిన్ని వార్తలు