ఆకర్షణీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలు

27 Jul, 2020 06:04 IST|Sakshi

క్యూ1లో లాభం రూ.3,118 కోట్లు

ముంబై: ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ.. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కరోనా కారణంగా చెల్లింపులు రాకపోవచ్చన్న అంచనాలతోనే రూ.5,550 కోట్లను పక్కన పెట్టింది (ప్రొవిజనింగ్‌). స్టాండలోన్‌గా చూసుకుంటే (అనుబంధ కంపెనీలను మినహాయించి) బ్యాంకు లాభం 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్లుగా నమోదైంది. లైఫ్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో స్వల్ప వాటాలను విక్రయించడం లాభాల వృద్ధికి దోహదపడింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగి రూ.37,939 కోట్లుగా నమోదైంది. మారటోరియం వినియోగించుకున్న రుణ గ్రహీతల శాతం ఏప్రిల్‌ చివరికి 30 శాతంగా ఉంటే, జూన్‌ ఆఖరుకు 17.5 శాతానికి తగ్గింది.

మరిన్ని వార్తలు