ICICI Revise Interest Rates: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!

13 Mar, 2022 11:51 IST|Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ బాటలోనే ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కూడా బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మాత్రమే వర్తించనున్నాయి.      


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 

3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై అత్యధిక ఎఫ్‌డీ వడ్డీరేటు 4.6 శాతం.

 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం. 

 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు 

 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3 శాతం.

 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్‌డీలపై 4.15 శాతం వడ్డీ రేటు

 1 సంవత్సరం లోపు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి.

పైన పేర్కొన్న రేట్లు సాధారణ , సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను కూడా ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్‌ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారవు.

చదవండి: ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ.. ఎంతంటే?

మరిన్ని వార్తలు