ఎఫ్‌వోఎఫ్‌ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!

3 Jan, 2022 21:09 IST|Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్నియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ప్యాసివ్‌ మల్టీ-అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌(ఎఫ్‌వోఎఫ్‌) ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్‌ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈటీఎఫ్‌ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్‌ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. 

అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్‌ విధానంలో వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్‌ (ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌, స్ట్రాటజీ) చింతన్‌ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్‌ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్‌, పౌస్‌ల ఈటీఎఫ్‌లలో కూడా ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌కి ఉంటుందని తెలిపారు.

ఐసీఐసీఐ ప్రుడెన్నియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌
ఐసీఐసీఐ ప్రడెన్షియల్‌ ఫండ్‌ దేశంలోనే మొదటే సిల్వర్‌ ఈటీఎఫ్‌ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్‌, సిల్వర్‌ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్‌ రుణ పత్రాల్లోనూ ఎక్స్‌పోజర్‌ తీసుకుంటుంది. మనీ మార్కెట్‌ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్‌ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. సిల్వర్‌. ఈటీఎఫ్‌ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్‌లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్‌ ఎన్‌ఫ్‌వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్‌ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది.
 

మరిన్ని వార్తలు