ఇక్రిశాట్‌ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా..

6 Oct, 2021 12:17 IST|Sakshi

ఇక్రిశాట్‌ సంస్థ నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉష్ణమండల ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను తట్టుకుంటే అధిగ దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్‌ నుంచే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. 

ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమి అరిడ్‌ ట్రోపిక్‌ (ఇక్రిశాట్‌), హైదరాబాద్‌ నుంచి శనగల సాగుకు సంబంధించి మూడు నూతన వంగడాలను రూపొందించింది. ఈ నూతన వంగడాలు కరువు నేలలను తట్టుకోవడంతో పాటు రోగాలను సమర్థంగా ఎదుర్కొని అధిగ దిగుబడులు ఇస్తాయని ఇక్రిశాట్‌ తెలిపింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన  బీజీ 4005, ఐపీసీ ఎల్‌4-14, ఐపీసీఎంబీ 19-3 రకం విత్తనాలకు సెంట్రల్‌ వెరైటల్‌ రీసెర్చ్‌ కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు ఇక్రిశాట్‌ కార్యదర్శి త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు.  

సాధారణంగా కరువు సంభవించే ప్రాంతాల్లో మెట్ట భూముల్లోనే శనగలు సాగు చేస్తుంటారు. కరువు కారణంగా ప్రతీ ఏడు 60 శాతం దిగుబడి తగ్గిపోతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వంగడాలు కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని అధిక దిగుబడి ఇస్తాయని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్‌

>
మరిన్ని వార్తలు