విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్‌

23 Mar, 2023 01:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రయివేటైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్‌ యూ దిగ్గజం ఎల్‌ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు

. తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్‌ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్‌ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్‌ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్‌ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు