మీరు ఉద్యోగం మానేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక..!

4 Dec, 2021 18:43 IST|Sakshi

జీఎస్టీ విధించే విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్‌, ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌పై జీఎస్‌టీ విధిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఉద్యోగి తీసుకునే చివరి  జీతంపై కేంద్రం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పన్ను విధించడం లేదంటే తగ్గించాలా' అని నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి చెందిన అథారటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (aar)కి ఉంటుంది. అయితే డిసెంబర్‌ 3న ఏఏఆర్‌ అధికారికంగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేసిందంటూ నేషనల్‌ మీడియా కొన్ని కథనాల్ని ప్రచురించింది. 

ఆ రిపోర్ట్‌ ప్రకారం...ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగి..ఆ సంస్థకు రిజైన్‌ చేసే మరో సంస్థకు వెళ్లే సమయంలో కంపెనీని బట్టి నెల రోజులు లేదంటే, 15రోజుల పాటు నోటీస్‌ సర్వ్‌ చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే నోటీస్‌ సర్వ్‌ చేయని ఉద్యోగులు, వారి చివరి నెల జీతంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది' అనేది కథనం సారాంశం. అయితే ఇప్పుడు ఈ జీఎస్టీ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే 

భారత్ ఒమన్ రిఫైనరీస్ కేసులో తీర్పునిస్తూ, నోటీసు సర్వ్‌ చేయని ఉద్యోగికి..ఆ ఉద్యోగికి ఇచ్చే చివరి నెల జీతంలో గ్రూప్ ఇన్సూరెన్స్, టెలిఫోన్ బిల్లులపై జీఎస్టీ వర్తిస్తుందని అడ్వాన్స్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. నవంబర్ 30 న ఏఏఆర్‌ ప్రకటనపై ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.


 
ఈ తీర్పును ఉటంకిస్తూ..మాట్లాడిన నిపుణులు కంపెనీ నుండి ఒక వ్యక్తి తీసుకునే చివరి జీతం కూడా జీఎస్టీ వర్తిస్తుందని చెప్పారు. "నోటీస్ పిరిడ్‌ను అందించకుండా సంస్థను విడిచిపెట్టిన ఉద్యోగిపై సంస్థ 18 శాతం జీఎస్టీని వసూలు చేయొచ్చు" అని సెబి రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి చెప్పినట్లు లైవ్‌ మింట్‌ పేర్కొంది. అయితే నోటీసు సర్వ్‌ చేయని ఉద్యోగి వద్ద నుంచి మాత్రమే జీఎస్టీని వసూలు చేయాల్సి ఉంటుందని సోలంకి వివరించారు. అయితే దీన్ని బట్టి చివరి నెల నోటీస్‌ సర్వ్‌ చేయని ఉద్యోగి జీతంపై జీఎస్టీ వసూలు చేసే అవకాశం ఉండనుంది.  

చదవండి: కేంద్రం షాక్‌..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు

మరిన్ని వార్తలు