సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు

5 Jun, 2021 13:51 IST|Sakshi

వాట్సాప్ లో కొన్నిసార్లు డిలీట్ మెసేజ్ ల‌ను చ‌ద‌వాల్సి వ‌స్తుంది. వాట్సాప్ మాత్రం డిలీట్ అయిన మెసేజ్ ల‌ను మ‌ళ్లీ ఓపెన్ చేసి చ‌దివేలా ఆప్ష‌న్ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఈ చిన్న‌ట్రిక్ తో డిలీట్ మెసేజ్ ల‌ను చ‌ద‌వ‌చ్చు.ఆండ్రాయిడ్ ఫోన్ ల‌లో మాత్ర‌మే స‌దుపాయం ఉంది.  

 1. ముందుగా గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లాలి. గూగుల్ ప్లేస్టోర్ లో నోటిసేవ్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. 

2. ఇన్ స్టాల్ చేసుకున్న అనంత‌రం నోటిసేవ్ యాప్ సాయంతో  నోటిఫికేషన్‌లు, ఫోటోలు, మీడియా మరియు ఫైల్స్ చదివేలా మీరు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. 
 
3. అది పూర్త‌యితే డిలీటెడ్ మెసేజ్ ల‌ను చ‌దివే అవ‌కాశం ఉంది. .

4. మీరు అనుమ‌తులు ఇచ్చిన వెంట‌నే వాట్సాప్ తో పాటూ ప్ర‌తి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకుంటుంది. వాటిని మీరు ఓపెన్ చేసి చ‌దువుకోవ‌చ్చు. కాక‌పోతే డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్ ల‌ను తిరిగిపొందాలంటే నెల‌కు రూ.65 చెల్లించాల్సి ఉంటుంది. త‌ద్వారా  జిఫ్ మెసేజెస్‌, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొంద‌వ‌చ్చు.  

చ‌ద‌వండి : వాట్సప్‌ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా?
 

మరిన్ని వార్తలు