కంటి వ్యాధులకు జన్యు చికిత్స

11 Mar, 2023 04:00 IST|Sakshi

ఐఐటీ కాన్పూర్‌ అభివృద్ధి

రిలయన్స్‌ లైఫ్‌కు లైసెన్స్‌

న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌కు లైసెన్స్‌ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్‌ లైఫ్‌ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది.

జన్యు చికిత్సకు (జీన్‌ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్‌ సైన్సెస్, బయో ఇంజనీరింగ్‌ విభా గానికి చెందిన జయంధరణ్‌ గిరిధర రావు, శుభమ్‌ మౌర్య ఈ పేటెంటెడ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు