తగ్గేదేలే.. విద్యార్ధులకు అదిరిపోయే ఆఫర్లు, లక్షలు దాటి కోట్లలో జీతాలు!

26 Dec, 2021 12:56 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

కరోనా సంక్షోభం విద్యార్ధులకు కలిసొచ్చింది. ఐఐటీ విద్యార్ధులు క్యాంపస్‌ నుంచి బయటకు రావడమే ఆలస్యం కోట్లలో వేతనాలు చెల్లిస్తామంటూ దిగ్గజ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ బాంబే యూనివర్సిటీలో జరిగిన తొలిఫేజ్‌ ఇంటర్వ్యూలో ఆయా సంస్థలు 1400మంది విద్యార్ధుల్ని ఎంపిక చేసుకున్నాయి. వార్షిక వేతనాలు ఊహించని స్థాయిలో ఉండడంతో.. బాంబే యూనివర్సిటీ విద్యార్ధులు శాలరీలలో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేసుకున్నట్లు యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇలా ఒక్క బాంబే యూనివర్సిటియే కాదు. దేశం మొత్తం మీద మరో ఏడు యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధులు భారీ ఎత్తున ప్యాకేజీల్ని సొంతం చేసుకున్నారు.  

ప్రపంచ దేశాల్లో కోవిడ్‌ కారణంగా డిజిటలైజేషన్‌ వేగంగా వృద్ధి సాధింస్తోంది. దీంతో టెక్నాలజీ రంగంలో  నిష్ణాతులైన ఉద్యోగులకోసం టాటా,ఇన్ఫోసిస్‌, మైండ్‌ ట్రీ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే  పలుమార్లు జరిపిన ఇంటర్వ్యూల్లో ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధులకు దేశీయ కంపెనీలు అధికంగా వార్షిక వేతనం కింద  రూ.1.7 కోట్లు చెల్లించగా అంతర్జాతీయ కంపెనీలు రూ.2.2 కోట్లు చెల్లించాయి. ఈ శాలరీలు కోవిడ్‌ ముందు కంటే 19 శాతం అధికంగా ఉన్నాయి. 

ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్‌
ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్‌ యూనివర్సిటీల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యులు జరిగాయి. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 15 రోజుల పాటు జరిగిన ఫస్ట్‌ ఫేజ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 1250 మంది ఎంపికయ్యారు. వారిలో 60 మంది కోటికి పైగా ప్యాకేజీని పొందారు.గతేడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది 45 శాతం మంది విద్యార్ధులు ప్లేస్‌మెంట్‌ సంపాదించారు. ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌ సెలక్షన్‌లలో 73 శాతం మంది విద్యార్ధులు జాక్‌ పాట్‌ కొట్టేశారు. 

వీరితో పాటు ఐఐటీ వారణాసి యూనివర్సిటీ, కాన్పూర్‌ ఐఐటీ, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఇలా అన్నీయూరివర్సిటీలకు చెందిన 185మంది విద్యార్ధులు కోటి కంటే ఎక్కువ వేతనాల్ని దక్కించుకున్నారు.కాన్పూర్‌ యూనివర్సిటీలో 49 మంది, మద్రాస్‌లో 27,బాంబేలో 12, రూర్కేలో 11, గుహతిలో 5, బీహెచ్‌యూలో ఒకరు రూ.కోటిపైగా ప్యాకేజీ అందుకున్నారు. 22మంది పైగా విద్యార్ధులు రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. 

ఐటీ రంగానికి భారీ డిమాండ్‌ 
కోవిడ్‌ కారణంగా అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. అయితే ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, దేశీయ కంపెనీలైన టాటా, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా,మైండ్‌ ట్రీ, ఇన్ఫోసిస్‌, విప్రో కంపెనీలు వచ్చే ఏడాది మార్చి నెల ముగిసే సమయానికి 2లక్షలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న విషయం తెలిసిందే.

చదవండి: భారతీయ విద్యార్ధులకు జాక్‌ పాట్‌, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..!

మరిన్ని వార్తలు