ఐకియాకు భారీ షాక్‌..!

15 Jun, 2021 17:30 IST|Sakshi

పారిస్‌: ప్రముఖ స్వీడిష్‌ ఫర్నీచర్‌ కంపెనీ ఐకియాకు ఫ్రాన్స్‌లో భారీ షాక్‌ తగిలింది. ఆ దేశపు కోర్టు కంపెనీపై సుమారు ఒక మిలియన్‌ డాలర్ల జరిమానాను విధించింది. ఐకియా తన కస్టమర్ల, ఉద్యోగులపై గూడచర్యం చేసిందని కోర్టు తేల్చింది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టోర్లను కలిగి ఉన్న ఐకియా గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల, ఉద్యోగుల సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోందని కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ పద్ధతుల ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను సమీక్షించినట్లు ప్రముఖ ఫ్లాట్‌ప్యాక్ ఫర్నిచర్ గ్రూప్ ఆరోపణలు చేయసాగింది. ఉద్యోగుల, కస్టమర్ల గోప్యతకు భంగం వాటిల్లేలా ఐకియా ప్రవర్తించిందని ఫ్లాట్‌ప్యాక్‌ ఫర్నిచర్‌ గ్రూప్‌ తెలిపింది. అంతేకాకుండా ఐకియా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కస్టమర్ల, ఉద్యోగుల డేటాను వాడినట్లు కోర్టు ధృవీకరించింది.

కాగా ఈ విషయంపై ఐకియా స్సందించింది. మరలా ఇలాంటివి జరగకుండా చూస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఐకియాకు ఫ్రాన్స్‌ మూడో అతిపెద్ద ఫర్నిచర్‌ మార్కెట్‌ దేశంగా నిలుస్తోంది. సుమారు ఐకియాకు ఫ్రాన్స్‌లో సుమారు పదివేల మంది ఉద్యోగులు  ఉన్నారు.

చదవండి: ఫ్రాంక్లిన్‌ ఏఎంసీ, ఉద్యోగులపై భారీ జరిమానా

మరిన్ని వార్తలు