ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థ విక్రయం

9 Apr, 2021 05:40 IST|Sakshi

ఎవర్‌స్టోన్‌ చేతికి వ్యర్థాల నిర్వహణ విభాగం

డీల్‌ విలువ రూ. 1,200 కోట్లు!

ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తాజాగా వెల్లడించింది.  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వీసెస్‌(ఐఈఐఎస్‌ఎల్‌)గా పిలిచే ఈ కంపెనీలో పూర్తి వాటాను పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌నకు అమ్మినట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ఎవర్‌ఎన్విరో రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని ఎవర్‌స్టోన్‌ కొనుగోలు చేసినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలియజేసింది.

డీల్‌ విలువను వెల్లడించనప్పటికీ ఈ విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకోను న్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై దివాళా చట్టంలో భాగంగా ఎన్‌సీఎల్‌టీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఐఈఐఎస్‌ఎల్‌ సమీకృత వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీగా సేవలందిస్తోంది. ప్రధానంగా మునిసిపల్‌ వ్యర్థాలకు సంబంధించి నిర్మాణం, తొలగించడం, కలెక్షన్, రవాణా, ఇంధన తయారీ తదితర పలు విభాగాలలో సర్వీసులను సమకూర్చుతోంది. ప్రస్తుతం రోజుకి 8,400 టన్నుల వ్యర్థాల నిర్వహణను చేపడుతోంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు