ప్రపంచ వృద్ధిలో భారత్‌, చైనాదే సగం వాటా.. ఐఎంఎఫ్‌ ప్రశంసల వర్షం

31 Jan, 2023 12:00 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (imf) భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న భారత ఆర్థిక వృద్ది రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తిరిగి పుంజుకుంటుందనే అంచనాల్ని ఉదహరిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. 

గ్లోబల్‌ వృద్ధి రేటు
ఐఎంఎఫ్‌ అప్‌డేట్‌ చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ అవుట్‌ లుక్‌లో 2022 గ్లోబల్‌ వృద్ధి రేటు 3.4 ఉండగా 2023లో 2.9 శాతానికి తగ్గి 2024లో 3.1శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది. 

ఈ సందర్భంగా  భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటుపై ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పియరీ ఒలివర్ గౌరించాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.8శాతంతో వృద్ది రేటు అక్టోబర్‌ అవుట్‌ లుక్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు  ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కానీ మార్చి తర్వాత ఇండియన్ ఎకానమీ 6.1 శాతానికి దిగజారుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు దేశంలోనే పరిస్థితులేనని అన్నారు. 

పురోగతి సాధ్యమే 
2022లో భారత వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతం తగ్గింది. అయితే దేశీయంగా స్థిరమైన డిమాండ్ కొనసాగనుందనే అంచనాలతో పురోగతి సాధిస్తూ 2024లో 6.8 శాతానికి చేరుకోనుంది. 

ఆసియా దేశాల్లో 
ఆసియా దేశాల్లో అభివృద్ది నిలకడగా కొనసాగుతున్న తరుణంలో ఐఎంఎఫ్‌ ఆర్ధిక వృద్ది రేటును పెంచింది. 2023లో వృద్ది రేటు 5.2శాతం ఉండగా 2024లో 5.5శాతానికి పెంచింది. 2022లో ఊహించిన దానికంటే లోతైన మందగమనం తర్వాత ఆసియా దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థకు 4.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్‌.
 
చైనా అభివృద్దిలో అడ్డంకులు   
2022 నాల్గవ త్రైమాసికంలో చైనా జీడీపీ మందగించింది. వెరసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉండటం చైనాకు ఇది మొదటిసారి. వ్యాపారంలో శక్తి సామర్ధ్యాలు తగ్గిపోవడం, క్షీణిత, నెమ్మదించిన నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2022 క్యూ4లో 3.0 శాతంగా ఉన్న వృద్ది రేటును 0.2శాతానికి తగ్గించింది. అది అలాగే మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే వృద్ది రేటు 2023లో 5.2 శాతం వరకు పెరగొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అభివృద్ధిలో ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాలతో 2024 కంటే ముందే  వృద్ది రేటు 4శాతం తగ్గొచ్చంటూ సూత్రప్రాయంగా వెల్లడించింది.    

ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది తిరుగులేని స్థానం
మీడియా ప్రతినిధులు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరించాస్ ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదేనని వెల్లడించారు.  అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు