చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం

9 Oct, 2021 14:38 IST|Sakshi

డబ్ల్యూటీవో రూల్స్‌ను విస్మరించి..  ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే చైనా అత్యాశ వాళ్ల పీకకే చుట్టుకుంది.  డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగ్‌లో పైరవీల ద్వారా మెరుగైన ర్యాంక్‌ సంపాందించిన వ్యవహారం బట్టబయలు కావడంతో చైనా నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. 


ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జియేవా(68)కు పదవీగండం పట్టుకుంది. గతంలో చైనాకు ఊడిగం చేశారన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆమె పాత్ర దాదాపు ఖరారైనట్లే!. దీంతో ఆమెను కొనసాగించడమా? తీసేయడమా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ బోర్డు చేతుల్లో ఉంది.  చైనాకు మెరుగైన ర్యాంకింగ్‌ లభించేలా వరల్డ్‌ బ్యాంక్‌ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని, డేటాను మార్చేశారని క్రిస్టలీనా (ఆ టైంలో ఆమె సీఈవోగా ఉన్నారు) ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరల్డ్‌ బ్యాంక్‌ మాజీ ప్రెసిడెంట్‌ జిమ్‌ యోంగ్‌ కిమ్ హస్తం ఉందని తేలింది.

డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారం ఆరోపణలపై వరల్డ్‌ బ్యాంక్‌ ఎథిక్స్‌ కమిటీ దర్యాప్తు చేసింది. మరోవైపు విల్‌మెర్‌హేల్‌ లీగల్‌ సంస్థ దర్యాప్తులోనూ ఆమెపై ఆరోపణలు నిజమని నిరూపితంకాగా, గురువారం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ  ఐఎంఎఫ్‌ బోర్డ్‌ మెంబర్స్‌కు లేఖ రాసింది క్రిస్టలీనా. పైగా ఫ్రాన్స్‌, యూరోపియన్‌ దేశాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.  ఈ తరుణంలో తొందరపాటు నిర్ణయంగా కాకుండా..  ఆమెను పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు సోమవారం నుంచి వరుస భేటీలు కానున్నాయి వరల్డ్‌బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ బోర్డులు.

డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగ్స్‌లో.. చైనా 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది.  అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ చైనా ఫేక్‌ ర్యాంకులు దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్‌ అంతర్గత దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశం.

చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్‌ పాత్ర కూడా!

మరిన్ని వార్తలు