డయాగ్నోస్టిక్స్‌ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్‌

18 Nov, 2021 06:20 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ డయాగ్నోస్టిక్స్‌ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్‌ ప్రవేశించింది. ఆధునిక వైద్య పరికరాలతో  అమీర్‌పేటలో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. బయోకెమిస్ట్రీ, బయోకెమికల్‌ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్, కోవిడ్‌–19, జీనోమిక్స్, మాలిక్యులార్‌ డయాగ్నోస్టిక్స్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకోజినోమిక్స్, రేడియాలజీ సేవలను పరిచయం చేసింది. టెస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే నమూనాలను ఇంటి వద్ద నుంచే సేకరిస్తారు.

తక్కువ సమయంలో పరీక్ష ఫలితాలను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. నిపుణుల నుంచి సలహాలూ పొందవచ్చని వివరించింది. యోధ లైఫ్‌లైన్‌ను అత్యాధునిక కంప్యూటింగ్, మాలిక్యులార్‌ డయాగ్నోస్టిక్స్‌ రంగంలో విశేష అనుభం ఉన్న సుధాకర్‌ కంచర్ల స్థాపించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటు ధరలో డయాగ్నోస్టిక్స్‌ సేవలను అందించనున్నట్టు తెలిపారు. యూఎస్‌ఏలో మూడు ఐటీ కంపెనీలతోపాటు సీఎల్‌ఐఏ ఆమోదం పొందిన ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్స్‌ సెంటర్స్‌ను ఆయన ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు