అసలే డిజిటలైజేషన్‌ డేస్‌.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!

21 Nov, 2022 09:09 IST|Sakshi

వేతనాలు,జీతాలు, బేసిక్‌ పే, పారితోషికం

యాన్యుటీ, పెన్షన్‌

టెర్మినేషన్‌ సందర్భంలో ఇచ్చిన మొత్తం

గుర్తింపు పొందని ఫండ్స్‌ నుండి ఇచ్చినది

కీమాన్‌ ఇన్సూరెన్స్‌ నుండి వచ్చినది గ్రాట్యుటీ (కొన్ని మినహాయింపులు ఉన్నాయి)

ఫీజు ,కమీషన్‌

∙ప్రయోజనాలు, లీవ్‌ఎన్‌క్యాష్‌మెంటు ,అడ్వాన్స్‌ జీతం, అరియర్స్‌ ,భవిష్యనిధికి 12 శాతం దాటి చేసిన జమలు .ఎన్‌పీఎస్‌కి చెల్లింపులు

జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నా­రు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. అవేమిటంటే.. ఇలా ఎన్నెన్నో .. యజమాని తన ప్రేమను కాసు­ల్లో కురిపిస్తే.. ప్రతి కాసు మీద పన్నుకట్టాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంది. మీరు ప్రస్తుతం ఇలాగే పన్ను కడుతున్నారు. ఏ సమస్యా లేదు. కానీ ఈ కింది వారిని ఒకసారి గమనించండి.

లెక్కలమాస్టారికి లెక్క లేదు .. నగరంలో నంబర్‌ వన్‌ లెక్కల మాస్టారు నగధరరావుగారు. ఉదయం 4 గంటల నుండి ట్యూ­షన్లు, కాలేజీ టైమింగ్స్‌ తర్వాత నిశిరాత్రి దాకా కొనసాగుతుంటాయి. కానీ ట్యూషన్‌ ఫీజుల మీద పన్ను కట్టలేదు. అంతే కాకుండా పేపర్‌ సెట్టింగ్, వేల్యుయేషన్, ఇన్విజిలేషన్‌ మీద వచ్చేదీ ఎక్కడా అగుపడదు. డ్రిల్లు మా­స్టారు యో­గేశ్వ­ర్రావుగారు కూడా అదే బాపతు. ఆయ­న యోగాలో ఎక్స్‌పర్టు. నగధరరావు గారిలా కాక­పోయినా మూడుబ్యాచ్‌లు .. అరవై మంది పిల్ల­లు. ఇలా చిట్టీలు నడిపే చిదంబరం, బుక్స్‌ అమ్మే బుచ్చిరాజు, ఆవకాయలు .. పచ్చళ్లు పెట్టే అనంతయ్య, జ్యోతిష్యం చెప్పే జోస్యుల, సంగీతం చెప్పే సంగీత రావు, బ్యూటీపార్లరు బుచ్చ­మ్మ, హోమియో డాక్టర్‌ హనుమాన్లు, జంతికలు .. వడియాలు అమ్మే జనార్దన రావు, జీడి­పప్పు .. కిస్‌మిస్‌ అమ్మే జీవనాధం, బట్టలు అమ్మే భుజంగం .. మొదలైనవారంతా మనకు కనిపిస్తూనే ఉంటారు. వీరి మీద మనకేం అసూ­య లేదు .. ఏడుపూ ఉండదు. కానీ చట్టాన్ని పక్కన పెట్టి వీరు రాజ్యం ఏలుతున్నారు. ‘‘మేం కష్టపడి సంపాదిస్తున్నాం. తప్పేంటి?’’, ‘‘రెక్కాడితే గానీ డొక్కాడదు’’, ‘‘కష్టేఫలి’’, ‘‘చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడు’’ అంటూ వాదనకు దిగొద్దు. డిపార్ట్‌మెంట్‌ వారి దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కృత్రిమ మేథస్సు ద్వారా ఎంతో సేకరించారు. అసలే ‘‘డిజిటలైజేషన్‌ డేస్‌’’ .. తగిన జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి సైడు ఆదాయాలన్నింటిపైనా పన్ను చెల్లించండి.

మరిన్ని వార్తలు