ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!

9 Feb, 2022 15:43 IST|Sakshi

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. గతంలో పొడిగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15 నాటికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్యమైన ఆదాయపు పన్ను సంబంధిత పత్రాలను దాఖలు చేయాలి అని ట్విటర్ వేదికగా పేర్కొంది. "ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, ఫారం 3 సీఏ-సీడీ/3 సీబీ-3 సీడీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. పీఎల్ ఫైల్ ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌లను, స్టేట్ మెంట్‌లను సెక్షన్ 44ఏబి కింద సాధ్యమైనంత త్వరగా సబ్మిట్ చేయండి" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.

అలాగే, "ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115జెసీ కింద ఫారం 29సీ దాఖలు చేయడానికి పొడగించిన గడువు తేదీ ఫిబ్రవరి 15, 2022. చివరి రోజు వరకు వేచి ఉండవద్దు. ఇప్పుడు ఫైల్ చేయండి!" అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇక అది అలా ఉంటే దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నది. అసెస్‌మెంట్‌ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌లను నూతన ఐటీ ఈ-ఫైలింగ్‌ పొర్టల్‌ కింద దాఖలు చేసినట్లు సీబీడీటీ తాజాగా వెల్లడించింది. 

(చదవండి: హైటెక్‌ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు)

మరిన్ని వార్తలు