స్త్రీ ధనం.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్లానింగ్‌

5 Apr, 2021 14:30 IST|Sakshi

ఆదాయపు పన్ను ప్రణాళికలో భాగంగా గతవారం వీలునామా గురించి తెలుసుకున్నాము. ఈ వారం స్త్రీ ధనం గురించి తెలుసుకుందాం. స్త్రీలకు వివాహ సందర్భంలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ ఇచ్చే స్థిరాస్తి, చరాస్తులను ‘‘స్త్రీ ధనం’’గా పరిగణిస్తారు. అత్తారింటికి దారేది అనుకుంటూ వెళ్లిన ఆడపిల్లకు స్త్రీ ధనం తోడు, నీడు, రక్షణగా ఉంటుందని ఇస్తారు. ఇలా సంక్రమించిన ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణించరు. అది స్త్రీ సొంత ధనం. హక్కులు సర్వం ఆమెవే. ఆదాయపు పన్ను ప్లానింగ్‌తో పాటు వివిధ చట్టాల ప్రకారం ఈ స్త్రీ ధనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ధనాన్ని స్త్రీ అనుభవించవచ్చు. లేదా ఎవరికైనా ఇవ్వచ్చు.  

లెక్క పక్కాగా ఉండాలి..
స్త్రీ ధనం కింద వచ్చిన కానుకలు, స్థిరాస్తి, చరాస్తులన్నింటిని సరైన పద్ధతిలో ఒక జాబితా రూపంలో తయారు చేయండి. ఇందులో అన్ని వివరాలు పొందపరచండి. వివరాలు స్పష్టంగా రాయండి. జాగ్రత్తగా జాబితాను భద్రపరుచుకొండి. అవసరమయితే సంతకాలు పెట్టండి. ఈ స్త్రీ ధనాన్ని కుటుంబ అవసరాల కోసం వాడుకోవచ్చు. అప్పుగా, వ్యాపారంలో పెట్టుబడిగా, సేవింగ్స్‌ కోసం వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి దానికి ఆధారాలు ముఖ్యం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

  • స్త్రీ ఆస్తుల జాబితా రూపొందించండి.
  • ఆమె కోసం పాన్‌ తీసుకొండి.
  • ఆమె ఆదాయాన్ని చూపిస్తే రిటర్నులు దాఖలు చేయండి.

ఈ ప్రయోజనాలను పొందవచ్చు..

  • సాధారణంగా ఇన్‌కమ్‌ టాక్స్‌ లెక్కల్లో ‘‘సోర్స్‌’’ సరిగ్గా లేక.., చెప్పలేక సమస్యలు వస్తుంటాయి. సరైన వివరణ లేకపోతే ‘ఆదాయం’గా చూపాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్త్రీ ధనం సోర్స్‌గా ఉపయోగపడుతుంది.
  • ‘స్త్రీ’ ధనం అవసరమయితే రుణం లేదా అప్పుగా వాడుకోవచ్చు. ఈ ధనాన్ని వాడుకున్న సందర్భంలో ‘‘సోర్స్‌’’గా చూపించిన తర్వాత, అప్పుగా చూపించి వడ్డీని లెక్కించవచ్చు. ఈ వడ్డీ స్త్రీకి ఆదాయం అవుతుంది. వాడుకున్న వారికి ఖర్చు అవుతుంది. ఇలా ఆదాయం తగ్గుతుంది. ఇల్లు కొనేందుకు, వ్యాపారం చేసుకునేందుకు, షేర్లకు కొనేందుకు వాడుకొవచ్చు.
  • వ్యవహారాలు బ్యాంకు ద్వారా నడిపించండి. నగదు వ్యవహారాలు వద్దు. అంతా సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా వ్యవహరించండి.

ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య

చదవండి: వీలునామా రాయడం మరువకుమా..! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు