Income Tax Refund: పన్ను ఎక్కువ కట్టారు.. తీసుకోండి

14 Aug, 2021 16:42 IST|Sakshi

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ శాఖ రూ. 47,318 కోట్లను ఇన్‌కం ట్యాక్స్‌ రీఫండ్‌ కింద చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 9 వరకు కాల వ్యవధిని పరిగణలోకి తీసుకుని ఈ రీఫండ్‌ చేసింది. 

ఇన్‌కం ట్యాక్స్‌ రీఫండ్‌ కింద రూ. 47,318 కోట్లను కింద 22.61 లక్షల మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ శాఖ జమ చేసింది. ఇందులో  రూ.14,241 కోట్ల రూపాయలు 21,38,375 మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ అవగా రూ.33,078 కోట్లు కార్పోరేట్‌ రీఫండ్‌ కింద 1,22,511 ఖాతాల్లో జమ అయ్యింది.

ఆదాయ పన్నుకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం కంటే అధికంగా చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి పొందే వీలుంది. దీనికి సంబంధించి అధికంగా పన్ను చెల్లించిన వారు ఈ మేరకు ఆదాయపన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ శాఖ పన్ను వివరాలను పరిశీలించి అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇ‍చ్చేస్తుంది.

మరిన్ని వార్తలు