నాన్‌–రెసిడెంట్‌ కార్పొరేట్లకు ఊరట.. దానిపై పన్ను భారం తగ్గింది!

20 Aug, 2022 12:10 IST|Sakshi

రెమిటెన్స్‌లు, టూర్‌ ప్యాకేజీలపై టీసీఎస్‌ మినహాయింపు

సీబీడీటీ నోటిఫై

న్యూఢిల్లీ: భారతదేశంలో శాశ్వతంగా ఉంటూ కార్యకలాపాలు నిర్వహించకపోవడం లేదా స్థిర వ్యాపార స్థలం లేని నాన్‌–రెసిడెంట్‌ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను భారం తగ్గించే  కీలక నిర్ణయాలను ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) తీసుకుంది.  రెమిటెన్సులు, టూర్‌ ప్యాకేజీలపై ఐదు శాతం టీసీఎస్‌ (మూలం వద్ద వసూలు చేసే పన్ను) చెల్లింపుల నుంచి ఆయా సంస్థలను మినహాయిస్తూ ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ మేరకు ఐటీ నియమాల్లో మార్పు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆదాయపు పన్న చట్టంలోని సెక్షన్‌ 206 సీ(1జీ) కింద మినహాయింపు పరిధిని (గతంలో నివాసితులు కాని వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది) విస్తరిస్తున్నట్లు తెలిపింది. కాగా, తాజా నిర్ణయ  నాన్‌–రెసిడెంట్లపై పన్ను భారాన్ని తగ్గిస్తుందని,  అలాగే విదేశీ సంస్థలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్న  భారతీయ పన్ను చట్టాలపై మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్యాక్స్‌) ఓమ్‌ రాజ్‌పురోహిత్‌ పేర్కొన్నారు.

చదవండి: బ్రిటన్‌ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది!


 

మరిన్ని వార్తలు