పనితీరు బ్రహ్మాండం..ఐటీఆర్‌ ఫైలింగ్‌ పోర్టల్‌పై ఇన్ఫోసిస్‌ ఆసక్తిర వ్యాఖ్యలు!

16 Aug, 2022 07:24 IST|Sakshi

బెంగళూరు: ఆదాయ పన్ను శాఖ ఈ–ఫైలింగ్‌ పోర్టల్, జీఎస్‌టీ నెట్‌వర్క్‌ వెబ్‌సైటు ‘చాలా బాగా’ పనిచేస్తున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ తెలిపారు. ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సజావుగా జరిగిందని ఆయన చెప్పారు.

జూలైలో రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు నమోదు కావడం, డెడ్‌లైన్‌ 31 నాటికి 5.8 కోట్ల పైచిలుకు ఐటీ రిటర్నులు దాఖలు కావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.  

ఇన్ఫోసిస్‌ 
ఐటీ శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్‌ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్‌ లాంచ్‌ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది.

సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్‌ రిటర్న్‌ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్‌ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్‌ పేయర్స్‌, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఈ తరుణంలో ఐటీఆర్‌ ఫైలింగ్‌ పోర్టల్‌ పనితీరుపై ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ స్పందించారు.

చదవండి👉 ష్‌..కథ మళ్లీ మొదటికొచ్చింది, ఇన్ఫోసిస్‌ ఇదేం బాగాలేదు!

మరిన్ని వార్తలు