మద్యం ప్రియులకు భారీ షాక్..!

28 Feb, 2022 19:38 IST|Sakshi

రష్యా - ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జరుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో బీర్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి. మద్యాన్ని త‌యారు చేసేందుకు ఉప‌యోగించే కీలకమైన బార్లీ ధరలు, సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో దేశంలో బీర్ ధ‌ర‌లు పెర‌గనున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా-ఉక్రెయిన్ వివాదంతో యుఎస్, కెనడాతో పాటు ఇత‌ర దేశాల్లో  రష్యా బ్రాండెడ్ స్పిరిట్‌లను బహిష్కరించడంతో వోడ్కా ధర భారీగా పెరిగింది.  

రష్యా, ఉక్రెయిన్ బార్లీ
రష్యా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బార్లీ ఉత్పత్తిని కలిగి ఉండగా, ఉక్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మాల్ట్ నాల్గవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అయితే యుద్ధ సంక్షోభం తీవ్రమైతే  బార్లీ ధరలు పెరిగే అవ‌కాశం ఉంది. 

దేశం బార్లీని ఉత్పత్తి చేస్తుంది
భారతదేశం కూడా బార్లీని ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని అనేక బ్రేవరీలు బార్లీ దేశీయ ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అయితే అంతర్జాతీయ బార్లీ ధరలు పెర‌గ‌డం వ‌ల్ల దేశీయంగా ధ‌ర‌ల‌పై ప్రభావితం కావచ్చు.
 
ప్ర‌భావం ఎలా ఉంటుందో
బీర్ బ్రాండ్ బిరా 91  చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంకుర్ జైన్ మాట్లాడుతూ..రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ బార్లీ ధరలపై ప్రభావం చూపుతుందని.  అయితే ఇది స్వల్పంగా ఉంటుందా..? దీర్ఘంగా కొన‌సాగుతుందో తెలియాల‌ని జైన్ చెప్పారు.

మరిన్ని వార్తలు