బిజినెస్‌విమెన్‌ @ ఏపీ.. పారిశ్రామికంలో ముందడుగు

18 Dec, 2023 18:00 IST|Sakshi

నాలుగేళ్లలో గణనీయమైన పురోగతి

ఎంఎస్‌ఎంఈలలో పెరిగిన మహిళా యాజమాన్యం

5.53 లక్షల మంది మహిళల రిజిస్ట్రేషన్‌

మహిళాభ్యుదయం.. పారిశ్రామిక రంగంలో వారి ప్రగతే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వివిధ పథకాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారు. దీంతో బిజినెస్‌ రంగంలో ప్రవేశిస్తున్న మహిళల సంఖ్యలో నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. 

ఎంఎస్ఎంఈలలో..
ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తోన్న ఏపీ.. వ్యాపార రంగంలో కూడా ఎన్నో ఘనతలు సాధించడం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగానే ఉంది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకు సంబంధించిన ‘ఉద్యమ్‌’ (Udyam) రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రకారం.. 2020 జులై 1 నుంచి 2023 డిసెంబర్‌ 4 నాటికి దేశంలో నమోదైన మొత్తం ఎంఎస్‌ఎంఈల సంఖ్య 3,16,05,581 (Udyam Assist ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్న అనధికారిక సూక్ష్మ సంస్థలతో సహా).

వీటిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1,17, 36,406 (ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌తో సహా). ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లలో మొత్తం 11,37,229 ఎంఎస్‌ఎంఈలు నమోదయ్యాయి. ఇందులో మహిళా ఎంఎస్‌ఎంఈలు 5,53,003 ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు.

సంవత్సరాల వారీగా చూస్తే.. 

సంవత్సరం నమోదైన ఎంఎస్‌ఎంఈలు
2020-21 6,51,74 
2021-22 1,47,374
2022-23 2,45,795
2023-24 6,78,886
మొత్తం  11,37,229
మహిళా యాజమాన్యంలోనివి 5,53,003

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మహిళలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా ​సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) స్థాపనకు లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇండస్ట్రియల్‌ పాలసీ 2021-23లో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ కమ్యూనిటీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేసింది.

పవర్ బిల్లులపై సబ్సిడీ, లీజ్ రెంటల్స్ పై రాయితీ, నోటిఫై చేసిన జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో స్టాల్స్ సెట్ చేయడానికి రీయింబర్స్మెంట్లు, ఫిక్స్డ్ క్యాపిటల్ పై పెట్టుబడి సబ్సిడీ వంటివి మహిళా వ్యవస్థాపకులకు ఇస్తున్న ప్రోత్సాహకాలలో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు