ఐఫోన్‌-12 స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధర తగ్గింపు..!

13 Aug, 2021 21:09 IST|Sakshi

మీరు ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. విజయ్ సేల్స్ ఆగస్టు 15 వరకు యాపిల్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నడుపుతోంది. ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ 12ను రూ.67,400 కంటే తక్కువకు విక్రయిస్తుంది. ఐఫోన్ 12 అసలు ధర రూ.79,900. కాబట్టి మీరు ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇది మంచి ఒక సమయం. ఐఫోన్ 12 గత సంవత్సరం వచ్చింది. ఇది ఆపిల్ ఇప్పటివరకు విక్రయించిన ఉత్తమ ఐఫోన్లలో ఇది ఒకటి. ఇది 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 12 యాపిల్ ఎ14 బయోనిక్ ప్రాసెసర్ మీద పనిచేస్తుంది.
 
ఇది ప్రస్తుతం ఐఓఎస్ 14.7మీద నడుస్తుంది. ఆపిల్ నుంచి రాబోయే నాలుగు సంవత్సరాల వరకు సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా ఐఫోన్ 12 ఈ ధరకు ఉత్తమ స్మార్ట్ ఫోన్లలో ఒకటి. వెనుక భాగంలో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 4కె వద్ద డాల్బీ విజన్ వీడియోలను రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరాలలో పీడిఎఎఫ్, ఓఐఎస్ ఉన్నాయి. ఐఫోన్ 12 డిస్కౌంట్ ధర రూ.73,400. అంటే మీరు ఐఫోన్ 12ను రూ.6,500 తక్కువకు పొందుతున్నారు. ఇప్పుడు, ఐఫోన్ 12ను రూ.67,400 కంటే తక్కువకు పొందాలంటే మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును ఉపయోగించిన తర్వాత మీరు రూ.6,000 డిస్కౌంట్ పొందుతారు. ఐఫోన్ 12పై మొత్తం డిస్కౌంట్ రూ.12,500.

మరిన్ని వార్తలు