డిసెంబర్‌లో ‘సేవలు’ పేలవం

6 Jan, 2022 08:32 IST|Sakshi

ఇండెక్స్‌ 58.1 నుంచి 55.5కు డౌన్‌  

న్యూఢిల్లీ: భారత సేవల రంగానికి సంబంధించి బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ డిసెంబర్‌లో 55.5కు పడిపోయింది. నవంబర్‌లో ఈ సూచీ 58.1 వద్ద ఉంది. సెప్టెంబర్‌ 2021 తర్వాత సూచీ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన గడచిన ఐదు నెలల్లో సూచీ వృద్ధి బాటలోనే ఉంది.  డిసెంబర్‌లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని, ధరల తీవ్రత ఉందని, మూడవ వేవ్‌ భయాందోళనలు పొంచిఉన్నాయని, ఆయా అంశాలు బిజినెస్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నెలవారీ సర్వే పేర్కొంది.

సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కూడా డిసెంబర్‌లో నామమాత్రంగానే ఉన్నాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా పేర్కొన్నారు.   భారత్‌లో నిరుద్యోగం డిసెంబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవలి గణాంకాలు వెల్లడించడం గమనార్హం.

మరిన్ని వార్తలు