చైనాకు ఎదురుదెబ్బ: భారత్‌లో జోరు

6 Dec, 2022 13:27 IST|Sakshi

2023లో 16.8 శాతం వృద్ధి: గ్రూప్‌-ఎం నివేదిక వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ప్రకటనల రంగం 2023లో 16.8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని గ్రూప్‌-ఎం నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే 15.8 శాతం వృద్ధితో భారత విపణి ప్రస్తుత సంవత్సరం రూ.1,21,882 కోట్లకు చేరుతుంది. డిజిటల్‌ అడ్వైర్టైజ్‌మెంట్లే ఈ రంగాన్ని ముందుండి నడిపిస్తాయి. 2022లో ఈ విభాగం వాటా మొత్తం పరిశ్రమలో ఏకంగా 48.8 శాతం ఉండనుంది.

మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే మరింత జోరు కొనసాగనుంది. ఈ ఏడాది రిటైల్‌ మీడియా పరిశ్రమ విలువ రూ.4,507 కోట్లు నమోదు కానుంది. 2027 నాటికి ఇది రెండింతలు అవుతుంది. 36 శాతం వాటా కలిగిన టీవీ ప్రకటనల వ్యాపారం 10.8 శాతం అధికం కానుంది. సంప్రదాయ, కనెక్టెడ్‌ టీవీల జోరుతో టీవీ అడ్వర్టైజ్‌మెంట్‌ సెగ్మెంట్‌ రెండంకెల వృద్ధి కొనసాగిస్తుంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ విస్తృత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య అనిశ్చితిని ఎదుర్కొంటోంది. బలహీన కరెన్సీ, అధిక నిరుద్యోగం, అధిక వడ్డీ రేట్ల నుండి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకుంటోంది.  

(చదవండి: సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ)

చైనాతో పోలిస్తే భారత్‌కే.. 
కోవిడ్‌-సంబంధిత లాక్‌డౌన్‌లు ఉన్నప్పటికీ 2022లో రూ.11,27,204 కోట్ల చైనా ప్రకటనల ఆదాయంతో పోల్చినప్పుడు, భారత పరిశ్రమ పరిమాణం చాలా చిన్నది. అయితే చైనా ఈ ఏడాది 0.6 శాతం తిరోగమన వృద్ధిని చవిచూడబోతోంది. 2023లో డ్రాగన్‌ కంట్రీలో పరిశ్రమ 6.3 శాతం పెరుగుతుందని అంచనా. చైనాతో పోలిస్తే భారత్‌కు అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకటనల రంగం 2022లో 6.5 శాతం, 2023లో 5.9 శాతం నమోదయ్యే చాన్స్‌ ఉంది’ అని నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్‌నెస్, వినోదం, ఆభరణాల సంస్థలు అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 20 శాతం వరకు పెంచాయని జాన్‌రైజ్‌ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్‌ డైరెక్టర్‌ సుమన్‌ గద్దె గుర్తుచేశారు.   (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!)

మరిన్ని వార్తలు