భారత్‌లో చైనా స్మార్ట్‌ ఫోన్లు ‘బ్యాన్‌’, స్పందించిన కేంద్రం!

12 Aug, 2022 10:27 IST|Sakshi

వారం రోజుల క్రితం భారత ప్రభుత్వం రూ.12వేల లోపు చైనా ఫోన్‌లపై నిషేధం విధించబోతోంది అంటూ బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఆ కథనంపై కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది. 

బ్లూమ్‌ బర్గ్‌ రిపోర్ట్‌పై కేంద్రం స్పందించినట్లు సమాచారం. చైనా సంస్థలైన షావోమీ, ఒప్పో, వివో ఫోన్‌లను భారత్‌లో అమ్మకుండా నిషేధం విధించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖకు ఉన్నతాధికారులు చెప‍్పినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి కేంద్రం రూ.12వేల లోపు ఫోన్‌లపై బ్యాన్‌ చేయాలని చర్చలు జరిపిన మాట నిజమేనని పేర్కొన్నాయి. కాకపోతే అవి చైనా ఫోన్‌లు కాదని, దేశీయ ఉత్పత్తి సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌ తో పాటు ఇతర కంపెనీలని హైలెట్‌ చేశాయి.

గత కొంత కాలంలో భారత్‌..చైనా సంస్థలపై ఓ కన్నేసింది. ఆ దేశానికి షావోమీ,వివో,ఒప్పోలు దేశ చట్టాల్ని ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో సదరు సంస్థలపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇప్పటికే 
చైనా బ్రాండ్స్‌ అంటే మండిపడే కేంద్రం.. డ్రాగన్‌ కు చెందిన టిక్‌ టాక్‌, పబ్జీతో పాటు వందల సంఖ్యలో యాప్స్‌ను బ్యాన్‌ చేసింది. తాజాగా పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన బీజీఎంఐని సైతం గూగుల్‌,యాపిల్‌ స్టోర్ల నుంచి తొలగించాయి.

చదవండి👉 మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్‌టాక్‌ సరికొత్త వ్యూహం!

మరిన్ని వార్తలు