కుదేలవుతున్న ఏవియేషన్‌, విమానాల రాకపోకలపై నిషేధం

1 Aug, 2021 10:49 IST|Sakshi

నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏవియేషన్‌ రంగానికి మరో ఎదురు దెబ్బతగిలింది. కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మనదేశంలో ఏవియేషన్‌ రంగాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలవుతోంది. భారతదేశంలోని విమానయాన సంస్థలు 2022 ఆర్థిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు ఏవియేషన్ కన్సల్టెన్సీ సిఏపీఏ అంచనా వేసింది. అందులో 1.1 బిలియన్ డాలర్లు ఐపివోలు, క్యూఐపిలు ఇతర పరికరాల రూపంలో అవసరం ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టాలు ఇప్పట‍్లో ఆగిపోయేలా లేవని తెలుస్తోంది.  

కరోనా నేపథ్యంలో..డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జులై 31వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తాజాగా,ఆ నిషేధాన్ని ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు 31వ తేదీ వరకు పొడిగించింది. వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాల కార్యకలాపాలు కొనసాగుతున‍్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదలతో విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ను ఎత్తేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో ఇండియన్ ఏవియేషన్ కు ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం ఆంక్షల్ని కొనసాగించడంతో  నష్టాలు పెరిగే అవకాశం ఉంది.   

కాగా, ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా  విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్న విషయం తెలిసిందే. వచ్చే నాలుగు సంవత్సరాల్లో  సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్‌ జున్‌జున్‌వాలా ప్రకటించారు. మ‌రి ఆయ‌న పెట్టుబ‌డుల‌తో ఏవియేషన్‌ రంగం ఎలాంటి వృద్ది సాధిస్తోంది చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు