Puma Shopping App: ప్యూమా సంచలన నిర్ణయం.. ఇండియాలో తొలిసారిగా..

7 Jun, 2022 14:00 IST|Sakshi

జర్మన్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ప్యూమా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇతర యూరప్‌ దేశాలను కాదని తొలిసారిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ఇండియాలో యాప్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్యూమాకు అనేక దేశాల్లో ఈ కామర్స్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ఉన్నాయి కానీ యాప్‌ లేదు. మొబైల్‌ యూజర్ల గణనీయంగా పెరగడంతో యాప్‌ రిలీజ్‌ చేయాలని ప్యూమా నిర్ణయించుకుంది. ఇందుకు ఇండియాను వేదికగా చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్యూమాకు ఉన్న అతి పెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి. 2021 డిసెంబరు వరకు ప్యూమా ఇండియాలో రూ.2,044 రెవెన్యూ సాధించింది. అంతకు ముందు ఏడాది 2020తో పోల్చితే ఇది 68 శాతం అధికం. ఇండియాలో తమ ‍బ్రాండ్‌కి ఉన్న ఆదరణ గమనించిన ప్యూమా ఇక్కడే తమ యాప్‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. 

ప్యూమాకి దేశశ్యాప్తంగా 450 స్టోర్లు ఉన్నాయి. ఇందులో 51 స్టోర్లు గతేడాదే ప్రారంభం అయ్యాయి. ఇండియాలో తమ ప్యూమా నంబర్‌ వన్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌గా ఉందని ఆ కంపెనీ సీఈవో జార్న్‌ గుల్డెన్‌ అన్నారు. అందుకే ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే యోచనలో ప్యూమా ఉన్నట్టు తెలిపారు. యాప్‌ ప్రారంభమైతే ప్యూమా ఉత్పత్తలు మరింత వేగంగా వినియోగదారులకు అందుతాయని ప్యూమా ఇండియా హెడ్‌ అభిషేక్‌ గంగూలీ అన్నారు. 

చదవండి: ‘అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా’

మరిన్ని వార్తలు