‘కుబేర్‌’కు యూనికార్న్‌ హోదా

7 Oct, 2021 04:02 IST|Sakshi

 క్రిప్టో ఎక్సే్ఛంజీ విభాగంలో రెండో స్టార్టప్‌

2021లో 30వ యూనికార్న్‌ స్టార్టప్‌గా రికార్డ్‌

ముంబై: క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్‌ కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ యూనికార్న్‌గా అవతరించింది. కంపెనీ విలువ బిలియన్‌ డాలర్లను తాకడంతో ఈ హోదాను పొందింది. పీఈ దిగ్గజాలు ఇతర సంస్థల నుంచి తాజాగా 26 కోట్ల డాలర్లు(రూ. 1,943 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 1.9 బిలియన్‌ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు బలపడింది. వెరసి క్రిప్టో ఎక్సే్ఛంజీ సంస్థలలో రెండో యూనికార్న్‌గా నిలిచింది.

ఇంతక్రితం కాయిన్‌డీసీఎక్స్‌ సైతం బిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేలండర్‌ ఏడాది(2021)లో క్వాయిన్‌స్విచ్‌ కుబేర్‌ 30వ యూనికార్న్‌ స్టార్టప్‌గా ఆవిర్భవించడం విశేషం! క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ సంస్థలు సానుకూలంగా లేనప్పటికీ పెట్టుబడులు వెల్లువెత్తడం గమనార్హం! కాయిన్‌స్విచ్‌ కుబేర్‌లో ఆండ్రిస్సేన్‌ హోరోవిట్జ్‌(ఏ16జెడ్‌), కాయిన్‌బేస్‌ వెంచర్స్‌ తాజాగా ఇన్వెస్ట్‌ చేశాయి.

వీటితోపాటు కంపెనీలో ఇప్పటికే వాటాదారులుగా కొనసాగుతున్న పారాడిగ్‌్మ, రిబ్బిట్‌ క్యాపిటల్, సీక్వోయా క్యాపిటల్‌ ఇండియా, టైగర్‌ గ్లోబల్‌ సైతం నిధులు అందించాయి. కాగా..  బిట్‌కాయిన్‌ తదితర ప్రయివేట్‌ క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేయడంతోపాటు.. ఇటీవల ప్రభుత్వ దృష్టికి సైతం తీసుకెళ్లింది. వీటి ట్రేడింగ్‌లో అత్యధిక హెచ్చుతగ్గులు, పారదర్శకత లోపించడం వంటి అంశాలను ప్రస్తా వించింది. తాజాగా సమీకరించిన నిధులను క్రిప్టోకు ప్రాచుర్యాన్ని కలి్పంచడం, 5 కోట్ల మందికి ప్లాట్‌ఫామ్‌ను చేరువ చేయడం తదితర లక్ష్యాలకు వెచి్చంచనున్నట్లు కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ తెలియజేసింది.  

లిషియస్‌ సైతం..
తాజా మాంసం, సీఫుడ్‌ బ్రాండ్‌ ఆన్‌లైన్‌ విక్రయాల స్టార్టప్‌ లిషియస్‌ సైతం యూనికార్న్‌ హోదాను పొందింది. 5.2 కోట్ల డాలర్లు(రూ. 389 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ తాజాగా బిలియన్‌ డాలర్లకు(రూ. 7,473 కోట్లు) చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఈ బెంగళూరు సంస్థ డైరెక్ట్‌ టు కన్జూమర్‌(డీటూసీ) విభాగంలో తొలి స్టార్టప్‌గా ఈ హోదాను సాధించినట్లు తెలియజేశాయి. సిరీస్‌ జీలో భాగంగా ముంబై సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు లిషియస్‌ వెల్లడించింది. మూడు నెలల క్రితమే కంపెనీ 3వన్‌4 క్యాపిటల్, టెమాసెక్‌ తదితరాల నుంచి 19.2 కోట్ల డాలర్లు సమకూర్చుకున్నట్లు టెక్‌క్రంచ్‌ తెలియజేసింది. దీంతో 65 కోట్ల డాలర్ల విలువను కంపెనీ అందుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ దేశవ్యాప్తంగా 14 నగరాలలో మాంసం, సీఫుడ్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు