యూనికార్న్‌గా బీఎల్‌ఎస్‌

16 Dec, 2022 08:23 IST|Sakshi

బిలియన్‌ డాలర్ల విలువకు చేరిక 

న్యూఢిల్లీ: టెక్‌ ఆధారిత సర్వీసుల సంస్థ బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ తాజాగా యూనికార్న్‌ హోదాను అందుకుంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీ షేరు గత ఆరు నెలల్లో 110 శాతం దూసుకెళ్లింది. దీంతో మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్లను దాటింది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 14 శాతమే బలపడటం గమనార్హం!

2005 నుంచీ కంపెనీ ప్రభుత్వాలు, ఎంబసీలకు ఔట్‌సోర్సింగ్‌ వీసాలు, పాస్‌పోర్టులతోపాటు.. సిటిజన్‌ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం 71 శాతం జంప్‌చేసి రూ. 630 కోట్లను తాకగా.. నికర లాభం సైతం 71 శాతం ఎగసి రూ. 82 కోట్లకు చేరినట్లు బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ తెలియజేసింది.  

(బీఎల్‌ఎస్‌ షేరు బీఎస్‌ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 198.5 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 8,153 కోట్లుగా నమోదైంది.)   

మరిన్ని వార్తలు