India July 2022 GST Collections: జులై నెల‌లో రూ.1.49 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూళ్లు!

1 Aug, 2022 15:16 IST|Sakshi

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో స‌రికొత్త రికార్డ్‌లు న‌మోదవుతున్నాయి. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై నెల‌లో 28శాతం పెరిగి దేశం మొత్తం మీద రూ.1.49ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూలైన‌ట్లు ఆర్ధిక శాఖ ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపింది. 

మార్చిలో వ‌సూలు చేసిన జీఎస్టీ కంటే జులై నెల‌లో క‌లెక్ట్ చేసిన జీఎస్టీ 3 శాతం పెరిగింది. దీంతో గ‌త 5 నెల‌ల నుంచి ప్ర‌తి నెల రూ.1.4కోట్లుకు పైగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయే త‌ప్పా ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని ఆర్ధిక శాఖ పేర్కొంది. 

ఇక వసూలైన జీఎస్టీ క‌లెక్ష‌న్‌ల‌లో  సెంట్ర‌ల్ జీఎస్టీ రూ.25,751, స్టేట్ జీఎస్టీ రూ.32,807 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.79,518కోట్లు, సెస్ రూ.10,920కోట్లు న‌మోదైంది. 

మరిన్ని వార్తలు