భారీగా మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు

23 Mar, 2023 01:55 IST|Sakshi

ఫిబ్రవరి నాటికి రూ.78,000 కోట్లు

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్‌ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. ఇందులో యాపిల్‌ ఫోన్ల ఎగుమతులే సగం విలువను ఆక్రమించగా, 40 శాతం శామ్‌సంగ్‌ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వివరాలను మొబైల్‌ తయారీ పరిశ్రమ సంఘం ఐసీఈఏ తెలిపింది.

జనవరి నాటికి మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 8.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని, ఫిబ్రవరి చివరికి 9.5 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు అంచనా వేస్తున్నామని ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రా నిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 10 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశం నుంచి 5.5 బిలియన్‌ డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు