100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు!

17 Jul, 2022 12:48 IST|Sakshi

భారత్‌లో క్రూడాయిల్‌ ధర బ్యారల్‌ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్‌ తర్వాత తొలిసారి బ్యారల్‌ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్‌ ధరలు తగ్గుతాయని ఊహించారు. కానీ వాటి ధరలు అలాగే కొనసాగుతాయని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

దేశీయంగా ఏప్రిల్‌ 25న బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 99.17 డాలర్లు ఉండగా..ఆ తర్వాత వాటి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ వచ్చాయి. అయితే జులై 14న  అదే క్రూడాయిల్  ధర బ్యారెల్‌ 99.76 డాలర్లు చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం, డిమాండ్‌ - సప్లై వంటి భయాల కారణంగా ధర 5.5శాతం తగ్గింది.

మార్కెట్‌లు ఒడిదుడుకుల మధ్య సౌదీ అరేబియా ముందస్తు ఉత్పత్తిని పెంచుతుందనే ఆశతో బెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ 100డాలర్ల కంటే ఎక్కువ పెరిగింది. కానీ యూఏఈ మాత్రం క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించింది. అయితే ఈ తరుణంలో పెట్రోల్‌,డీజిల్‌ తగ్గిపోతాయనుకున్న వాహన దారులకు భంగపాటు ఎదురైంది. చమురు కంపెనీలు నష్టాల్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్పా.. వాటిని వాహనదారులపై బదాలయించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది.   

నష్టాల నుంచి గట్టెక్కుతున్నారు.
క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. గతంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మే నెలలో కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 తగ్గించడంతో చమురు కంపెనీలకు మరింత భారం పెరిగింది. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, బ్యారల్‌ ధర పెరుగు ధరలతో చమురు కంపెనీలు క్రూడాయిల్‌పై భారీగా ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు తక్కువకే  ధరకే క్రూడాయిల్‌ బ్యారెల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. పెట్రో ధరల్ని అలాగే కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు