నవంబర్‌లో ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు

16 Dec, 2022 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతు లు నవంబర్‌ నెలకు ఎలాంటి వృద్ధి లేకుండా 31.99 బిలియన్‌ డాలర్లు (రూ.2.62 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2021 నవంబర్‌ నెలలోనూ ఎగుమతులు 31.8 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక నవంబర్‌ నెలకు దిగుమతులు 55.88 బిలియన్‌ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 53.93 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4 శాతం వరకు పెరిగాయి.

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలోనూ ఎగుమతులు 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు చూస్తే ఎగుమతులు 295.26 బిలయన్‌ డాలర్లుగా, దిగుమతులు 493.61 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి వరుసగా 256.77 బిలియన్‌ డాలర్లు, 381.17 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉన్నాయి.    

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు