ఎగుమతులకు ‘గ్లోబల్‌’ దన్ను!

3 Sep, 2021 02:35 IST|Sakshi

ఆగస్టులో 45 శాతం అప్‌

విలువలో 33 బిలియన్‌ డాలర్లు

51 శాతం పెరిగి 47 బిలియన్‌ డాలర్లకు దిగుమతులు

14 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు  

న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ పటిష్టత, పెరిగిన గ్లోబల్‌ ఆర్డర్స్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి ఆగస్టులో ఎగుమతులు 45 శాతం ఎగశాయి. విలువలో 33.14 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 22.83 బిలియన్‌ డాలర్లు. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 47.01 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.87 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే (8.2 బిలియన్‌ డాలర్లు) వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు గురువారం తొలి అంచనాలను వెలువరించింది.  

ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య..: ఈ ఏడాది (2021–22) తొలి 5 నెలల్లో (ఏప్రిల్‌–ఆగస్టు) భారత్‌ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 163.67 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే (98.05 బిలియన్‌ డాలర్లు) ఈ పరిమాణం 67% పెరిగింది.  ఇక ఇదే కాలంలో దిగుమతుల విలువ 82% పెరిగి 219.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 56 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను భారత్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► కోవిడ్‌–19 ముందస్తు 2019 ఆగస్టులో పోల్చి చూసినా ఎగుమతులు 27.5 శాతం పెరగడం సానుకూల అంశం.  
► ఇంజనీరింగ్‌ గూడ్స్, పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయం పెరిగింది.  
► ప్రస్తుత సమీమీక్షా నెలలో బంగారం దిగుమతుల విలువ 82.2 శాతం పెరిగి 6.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.
► పెట్రోలియం క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతుల బిల్లు 11.63 బిలియన్‌ డాలర్లు.

మరిన్ని వార్తలు