దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ

22 Apr, 2023 07:38 IST|Sakshi

న్యూఢిల్లీ: లిథియం అయాన్‌ సెల్‌ తయారీలో దేశంలో తొలి ప్లాంటు బెంగళూరు సమీపంలో ప్రారంభం అయింది. బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్‌ లాగ్‌9 మెటీరియల్స్‌ దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం 50 మెగావాట్‌ అవర్‌. ‘దేశీయ మార్కెట్‌ కోసం సెల్స్‌ను భారత్‌లో రూపొందించాం.

ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్‌ కంపెనీలకు షాక్‌! ఆ కార్లు రీకాల్‌ చేసేయాలని అభ్యర్థనలు

ఇక్కడి వాతావరణ పరిస్థితులు, కస్టమర్లకు అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయం చేస్తూ భారత్‌ను స్వావలంబన చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాం’ అని లాగ్‌9 కో–ఫౌండర్, సీఈవో అక్షయ్‌ సింఘాల్‌ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ బ్యాటరీలు 3,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించారు. 20కిపైగా నగరాల్లో విస్తరించినట్టు సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

మరిన్ని వార్తలు