నవంబర్ 5న జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభం!

1 Nov, 2021 18:50 IST|Sakshi

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రీమియం రిటైల్ షాపింగ్ మాల్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను ఆవిష్కరించింది. ముంబైలోని వాణిజ్య కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. మేకర్ మాక్సిటీ వద్ద 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. జియో వరల్డ్ డ్రైవ్ ముంబైలో సరికొత్త ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలో 72 ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన 27 ఫుడ్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. ఇది ముంబైలోని తొలి మొదటి అంతస్థులో ఉండే డ్రైవ్ ఇన్ థియేటర్‌. ఇది ఓపెన్ ఎయిర్ వీకెంట్ కమ్యూనిటీ మార్కెట్.

భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ సౌకర్యాలను కల్పించాలని, భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిని ప్రపంచానికి ప్రదర్శించాలనే దృక్పథంతో దీనిని రూపొందించారు. ఈ ప్రాంగణం భారతీయ, అంతర్జాతీయ ప్రజల అత్యంత విభిన్న కళలను గుర్తు చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు, వినియోగదారులను సృజనాత్మకత, కళాత్మక దృశ్యమాన చట్రంలో కనువిందు చేస్తున్నాయి. ముంబై స్ఫూర్తిని, ఇక్కడి అనేక విచిత్రాలను హైలైట్ చేసే వ్యక్తీకరణలు కూడా ఇక్కడ ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్-ఎయిర్ రూఫ్‌టాప్ థియేటర్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను నవంబర్ 5న తెరవనున్నారు. 

(చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?)

పీవీఆర్ నిర్వహిస్తున్న జియో డ్రైవ్-ఇన్ 290 కార్లతో పట్టణంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను కలిగి ఉంది. తమ స్వంత కారులో కూర్చొని సినిమాలు చూడవచ్చు.  కొత్త కాన్సెప్ట్ 6 అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లు, ప్రివ్యూతో ప్రారంభించబడింది. వీఐపీలకు, అతిథులకు థియేటర్‌లో ప్రత్యేక ప్రవేశం ఉంటుంది. హోమ్ డెకర్ బెహెమోత్- వెస్ట్ ఎల్మ్, హామ్లీస్ గ్లోబల్-ఫస్ట్ కాన్సెప్ట్ స్టోర్ హామ్లీస్ ప్లే కూడా ఇక్కడ ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రఖ్యాత ఆర్కిటెక్ డిజైనర్లు రాస్ బోన్థోర్న్, ఆండీ లాంపార్డ్ డిజైన్ చేశారు. జియో వరల్డ్ డ్రైవ్ ముఖభాగం ఫ్రెంచ్ కాన్సెప్ట్ న్యూజ్, ఇది క్లౌడ్ లాంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ విస్తరించిన స్కైలైట్‌తో హై స్ట్రీట్ అనుభవం లభిస్తుంది. 

మరిన్ని వార్తలు