ఫ్యాషన్‌కు భారత్‌ రాజధాని కావాలి - కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌

12 Feb, 2022 14:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ అంతిమంగా ప్రపంచ ఫ్యాషన్‌కు రాజధానిగా అవతరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభిలషించారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఫ్యాషన్‌ బ్రాండ్లు విరాజిల్లాలని కోరుకున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి ఫ్యాషన్‌ డిజైనర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. గుర్తించిన 75 లక్షల హస్తకళాకారులు ప్రతీ నెలా రూ.1,000 మేర అదనపు ఆదాయం సంపాదించేలా కృషి చేయాలని డిజైనర్లను మంత్రి కోరారు. భారత హస్తకళలను, వారసత్వాన్ని గుర్తించి, పరిరక్షించడమే తదుపరి లక్ష్యంగా పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు