ఎల్‌ఐసీలోకి విదేశీ పెట్టుబడులు.. 

25 Aug, 2021 03:48 IST|Sakshi

ప్రతిపాదనలు పరిశీలిస్తున్న కేంద్రం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు కూడా పాలుపంచుకునేందుకు అవకాశం లభించనుంది. దీనిపై గత కొద్ది వారాలుగా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ శాఖలు కూడా చర్చించాక, క్యాబినెట్‌ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించాయి. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం బీమా రంగ సంస్థల్లో ఆటోమేటిక్‌ విధానంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే, ప్రత్యేకంగా చట్టం ద్వారా ఏర్పాటైన ఎల్‌ఐసీకి మాత్రం ఇది వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలంటే సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్‌ఐసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.    

మరిన్ని వార్తలు