మొబైల్‌ స్పీడ్‌లో మెరుగుపడ్డ భారత్‌.. 5జీ రాకతో దూకుడు!

20 Feb, 2023 14:04 IST|Sakshi

దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్‌ స్పీడ్‌లో భారత్‌ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్‌లో 79వ స్థానంలో ఉన్న భారత్‌ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది.

ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లోనూ భారత్‌ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్‌లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్‌సైట్స్‌ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్‌డ్‌ మొబైల్‌ స్పీడ్‌ సగటు డిసెంబర్‌లో 49.14 ఎంబీపీఎస్‌ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్‌కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్‌ మొబైల్‌ స్పీడ్‌ సగటులో భారత్‌ నవంబర్‌లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్‌ మొబైల్‌ స్పీడ్‌ సగటు గత డిసెంబర్‌లో 25.29 ఎంబీపీఎస్‌ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్‌కు మెరుగుపడింది.

జనవరి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్‌ సగటు మొబైల్ స్పీడ్‌ చార్ట్‌లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్‌ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్‌డ్‌ మొబైల్ స్పీడ్‌ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది.

మరిన్ని వార్తలు