2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!

24 Mar, 2022 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం అంటే భార‌తీయుల‌కు.. ప్ర‌త్యేకించి ఆడపడుచులకు చాలా ఇష్టం.. వీలైతే బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోలు చేయ‌డానికే మొగ్గు చూపుతుంటారు. భార‌త్‌లో పెండ్లిండ్ల‌లో న‌వ వ‌ధువుకు బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రి. పండుగ‌ల స‌మ‌యంలో గిఫ్ట్‌లుగానూ ఆభ‌ర‌ణాలు బ‌హుక‌రిస్తుంటారు. అయితే, అలాంటి బంగారాన్ని దేశీయంగా ఉత్ప‌త్తి చేసేది కేవ‌లం ఒక‌శాత‌మే మాత్రమే. మిగ‌తా అంతా విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిందే.

భారత్‌ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 651 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019-20) పసిడి దిగుమతులు 720 టన్నులుగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య‌శాఖ స‌హాయ మంత్రి అనుప్రియా ప‌టేల్ బుధ‌వారం లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల్లో రాత‌పూర్వ‌క స‌మాధానంలో చెప్పారు. ఇక 2018-19లో 983 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు ప్రకటించారు. పుత్త‌డి దిగుమ‌తిలో పొరుగు దేశం చైనా త‌ర్వాతీ స్థానం మ‌న‌దే. కానీ గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం పుత్త‌డి దిగుమ‌తులు త‌గ్గాయి. 

(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్‌..!)

మరిన్ని వార్తలు