పురోగతిలో భారత్.. వారికే ఉద్యోగావకాశాలు

19 Feb, 2024 06:30 IST|Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నప్పటికీ.. ఇందులో నైపుణ్యం కలిగిన వారికి మాత్రం బోలెడన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. ఏఐలో భారత్ గణనీయమైన వాటా కలిగి ఉంది.

ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం కోసం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో కూడా పరిశ్రమతో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులకు ముందు కేంద్ర ఆర్ధికమంత్రి కూడా మారుతున్న టెక్నాలజీలో నైపుణ్యం పెంపొందించుకోవాలి.. లేకుంటే ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదని స్పష్టం చేశారు.

ఏఐ ఆవశ్యకత గురించి ఐబీఎమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. ఏఐతో ఆత్మ నిర్భర్ లక్ష్యం సాధించాలంటే ప్రపంచంలో ఏఐ వినియోగం, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ టెక్నాలజీలో పురోగతి సాధించాలంటే పాలసీ విధానాల రూపకల్పన, పెట్టుబడులు మాత్రమే కాకుండా స్కిల్స్ కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ మరింత విస్తృతంగా వ్యాపిస్తుంది. కొన్ని సంస్థలు కూడా ఈ టెక్నాలజీలో తమ ఉద్యోగులకు ట్రైనింగ్ వంటివి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి

whatsapp channel

మరిన్ని వార్తలు