రూ.1500 కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం

30 May, 2022 18:13 IST|Sakshi

అతిపెద్ద బీ2బీ సర్వీస్ ప్రొవైడర్  ‘పేమేట్‌’ ఐపీఓ ‍త్వరలో

ముంబై: దేశీయఅతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ లావాదేవీ సంస్థ పేమేట్ ఇండియా ఐపీవోకు రానుంది. 1,500 కోట్ల రూపాయలను సమకీరించే ఉద్దేశంతో  ఐపీఓకు సంబంధించిన ప్రతిపాదనలను సెబికి అందజేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌నుసెబీరి అందించింది.ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయాలని  భావిస్తోంది. 

ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 375 కోట్ల రూపాయలు, పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా మరో 1,125 కోట్ల రూపాయలను సమీకరించు కోవాలని పేమేట్ ఇండియా నిర్ణయించింది. తాను జారీ చేయబోయే పబ్లిక్ ఇష్యూల్లో 75 శాతాన్ని క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ కొనుగోలు దారులకు  కేటాయించింది. అలాగే 15 శాతం పబ్లిక్ ఇష్యూలను నాన్ ఇన్‌స్టిట్యూషన్ క్వాలిఫైడ్ బిడ్డర్స్ కోసం రిజర్వ్ చేసింది. మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెసర్టకు  కేటాయించనుంది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ కేపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, జేఎంఫైనాన్షియల్ లిమిటెడ్, ఎస్‌బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ రిజిస్ట్రార్లు వ్యవహరిస్తాయి. షేర్ ప్రైస్ బ్యాండ్, ఇతర కీలక తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామనికంపెనీ ప్రకటించింది. సెబీ నుంచి అనుమతి లభించిన వెంటనే పూర్తి సమాచారాన్ని అందిస్తామని పేర్కొంది.

కాగా 2016లో డిజిటల్ టెక్నాలజీల ఆధారిత సేవలను ప్రారంభించింది పేమేట్‌. ఐటీ, లాజిస్టిక్‌ పెయింట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సిమెంట్, ఆటో ఆక్సిలరీ, ట్రావెల్ అండ్ ఎయిర్‌లైన్, మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్ , ఇతర రకాల పరిశ్రమల్లో సేవలందిస్తున్న   మార్కెట్‌ లీడర్‌గా ఉంది. 

మరిన్ని వార్తలు