డిజిటలైజేషన్‌లో భారత్‌ మార్గదర్శి

10 Oct, 2022 06:21 IST|Sakshi

ప్రపంచబ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌ ప్రశంస  

వాషింగ్టన్‌: డిజిటలైజేషన్‌ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్‌లో డిజిటలైజేషన్‌ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్‌–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్‌లో డిజిటలైజేషన్‌ కీలక ప్రాత పోషించిందని అన్నారు.

పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్‌లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు.  ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్‌సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి,  పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్‌ మాల్పాస్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు