పెరిగిన బంగారం..వెండి ధరలు తగ్గుముఖం

18 Sep, 2020 20:31 IST|Sakshi

ముంబై : బంగారం, వెండి ధరలు రోజుకో తీరుగా ఒడిదుడుకులతో సాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 164 రూపాయలు పెరిగి 51,617 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 118 రూపాయలు దిగివచ్చి 68,024 రూపాయలకు పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారమయ్యాయి. డాలర్‌ బలహీనపడటం, అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో పాటు ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత కొరవడటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. స్పాట్‌ గోల్డ్‌ 1.1 శాతం పెరిగి 1958 డాలర్లకు ఎగబాకింది.

మరిన్ని వార్తలు