స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు భారీ షాక్‌: కేంద్రం సంచలన నిర్ణయం?

14 Mar, 2023 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ భద్రత నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.  పలు స్మార్ట్‌ఫోన్లలోముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను నిరోధించే ప్లాన్‌లో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం యోచన ప్రకారం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చైనా సహా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు భారీ షాక్‌ తగలనుందని మార్కెట్‌ వర్గాలు  భావిస్తున్నాయి. 

రాయిటర్స్  నివేదిక ప్రకారం  గూఢచర్యం , వినియోగదారు డేటా దుర్వినియోగం గురించి ఆందోళనల మధ్య భారతదేశ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను తీసుకురానుంది.  ఫిబ్రవరి 8న ప్రభుత్వ రహస్య రికార్డు ప్రకారం ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తీసివేయడానికి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడానికి అనుమతించమని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను నిలువరించాలని యోచిస్తోంది. చైనా సహా విదేశీ కంపెనీల గూఢచర్యాన్ని నిరోధించాలని భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి  నిరాకరించిన సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్  నివేదించింది. (పోకో ‘ది 5జీ ఆల్‌ స్టార్‌’ లాంచ్: ఆఫర్‌ ఎంతంటే?)

కొత్త నిబంధనల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆయా ఫోన్లలో అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్‌ ఇ‍వ్వాలి. అలాగే  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆమోదించిన ల్యాబ్ ద్వారా కొత్త మోడల్స్‌ టెస్టింగ్‌కు సమ్మతించాలి.  ప్రతి ప్రధాన ఆపరేటింగ్సిస్టమ్ అప్‌డేట్‌ను వినియోగదారులకు అందించే ముందు తప్పనిసరి స్క్రీనింగ్‌  అంశాన్ని కూడా  ప్రభుత్వం పరిశీలిస్తోంది ప్రపంచంలోని నం.2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో  ఆయా కంపెనీల లాంచ్ టైమ్‌ లైన్‌లను పొడిగించవచ్చని, ఇది యాపిల్‌ సహా శాంసంగ్‌,  షావోమి, వివో తదితర సంస్థలకు  ఎదురుదెబ్బేనని  నిపుణులు భావిస్తున్నారు. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీలదే ఆధిపత్యం. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం షావోమి, బీబీకే ఎలక్ట్రానిక్స్ వివో, ఒప్పో మొత్తం ఫోన్‌ అమ్మకాలలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకోగా, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌కు 20శాతం, యాపిల్‌కు 3 శాతం వాటా ఉంది. (లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్‌: మ్యారీ నౌ పే లేటర్!)

పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?
♦ కెమెరా వంటి కొన్ని ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదాలకు చాలా కీలకమని, స్క్రీనింగ్ నిబంధనలను విధించేటప్పుడు ప్రభుత్వం వీటికి , అనవసరమైన వాటికి మధ్య తేడాను గుర్తించాలి.
♦ స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌లు తరచుగా తమ మొబైల్స్‌ను ప్రొప్రయిటరీ యాప్‌ల ద్వారా  విక్రయిస్తారు, అలాగే మానిటైజేషన్ ఒప్పందాలనుతో కొన్ని యాప్స్‌ను ముందే ఇన్‌స్టాల్‌ చేస్తారు. 
♦ ముఖ్య ఆందోళన ఏమిటంటే,  టెస్టింగ్‌లకు ఎక్కువ  సమయం పడుతుంది.  ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, దాని భాగాలను భద్రతా సమ్మతి కోసం ప్రభుత్వ ఏజెన్సీ  టెస్టింగ్‌కు దాదాపు 21 వారాలు పడుతోంది. ఈనేథ్యంలో గో-టు మార్కెట్ వ్యూహానికి ఇది భారీ అవరోధమని పరిశ్రమకు కొంతమంది ఎగ్జిక్యూటివ్స్‌అభిప్రాయం. 

కాగా  జాతీయ భద్రత ముప్పు నేపథ్యంలో 2020  ఇండో-చైనా సరిహద్దు ఘర్షణ ఆందోళనల నేపత్యంలో టిక్‌టాక్‌తో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు