6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే..

27 Dec, 2021 21:20 IST|Sakshi

భారతదేశంలో అతి త్వరలో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? అంటే, అవును అనే సమాధానాం వస్తుంది. టెలికాం రంగంలో ఆరవ తరం 6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి తయారీ & సేవల వ్యవస్థను సిద్ధం చేసేందుకు భారతదేశం 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ)ని ఏర్పాటు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కానున్న 6G టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) ఏర్పాటు చేసినట్లు టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) తెలిపింది.

"6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి భారతదేశంలో ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) సిద్ధం చేయడం అవసరం" అని కూడా డీఓటీ తెలిపింది. ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూపులో ప్రభుత్వం, అకాడెమియా, ఇండస్ట్రీ అసోసియేషన్, టిఎస్ డీఎస్ఐ(టెలికామ్ స్టాండర్డ్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా) సభ్యులుగా ఉంటారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వైష్నావ్ గతంలో పేర్కొన్నారు. 2024 లేదా 2025 ఏడాది ప్రారంభంలో ఈ 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు