జీ 20 భేటీ...

15 Oct, 2022 05:38 IST|Sakshi

వాషింగ్టన్‌లో జరిగిన జీ 20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్ల  4వ సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ను చిత్రంలో తిలకించవచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రపంచ దేశాలు ఐక్యంగా ఎదుర్కొనాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్‌ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి స్వీకరించనుంది.

డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్‌ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌లతో జరిపిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి వాషింగ్టన్‌ వచ్చిన నిర్మలా సీతారామన్, పలు దేశా ల ఆర్థికమంత్రులు, సంస్థల చీఫ్‌లతో  వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   
 

మరిన్ని వార్తలు